14 January 2012

'సంక్రాంతి' పండుగ - పూర్వోపరాలు

మన సనాతన ఆచారాలు , సంప్రదాయాలు  మానవజాతికి జీవం , సత్యవాక్కు ధర్మాచారణే  విజయానికి మూలం . పండుగలు చేయడంలో పరమార్థం ఆధ్యాత్మికత, చారిత్రాత్మక, ఆరోగ్య విషయాలు అంతరార్థంగా ఉన్నాయి. సంక్రాంతి పండుగ మూడు రోజులుగా భోగి , సంక్రాంతి , కనుమ పండుగ ఆంధ్రులు చేసుకొనే పెద్ద పండుగుల్లో ఒకటి.
సంక్రాంతి అంటే సంక్రమణం , మార్పు , సంచారం అని అర్థం .
 సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించిననపుడే ధనుర్మాసం మొదలైనట్లే - దాన్నే నెలపట్టడం అంటారు. పండుగ సందడి  ప్రారంభం. నెల పొడవునా సంక్రాంతి సందడే. సూర్యభగవానుడు మేషాది పన్నెండు రాశుల్లో ఒక్కోనెల ఒక్కొక్క రాశి వంతున ప్రవేశించి సంచారం చేస్తాడు.ధనురాశి నుండి మకరరాశిలోకి మారిన తరుణమే మకరసంక్రాంతి ఉత్తరాయణ పున్యకాలం ఆరంభం. ధనుర్మానంలో మృగశిర నక్షత్రంతో కూడినా మార్గశిరం పుష్య మాసాలు రెండు కలుస్తాయి.( ఇది ఇంచుమించు డిసెంబర్15 నుండి జనవరి15 వరకు )  రాశి మార్పులన్నీ  సంక్రమణాలే  అయినా మకర సంక్రాంతినే పండుగగా చేసుకుంటున్నాం. ఎందుచేతనంటే మకర సంక్రాంతికి నరకయాతనలన్ని పోయి వర్గద్వారాలు తెరుచుకుంటాయని హిందువ్వుల  విశ్వాసం . పుణ్యకార్యాలు జరిపే ఉత్తమకాలమే ఉత్తరాయణమనటం వాడుక.
సంక్రాంతి మాసంలో చేసే స్నాన, దాన, జపదాన్యలకేంతో విశేషఫలం దక్కుతుంది. ఆ నెలలో చేతనైన దాన,  పుణ్య కార్యాలు చేయాలి. పితృ దేవతల్ని స్మరించుకొని వారి దీవెనలు తీసుకోవాలి.

ఈ సంక్రాంతిని బొమ్మల పండుగ, ముగ్గుల పండుగ, గొబ్బిళ్ళ పండుగ, పంటల పండుగ, పశువుల పండుగ, ఇంకా  హాస్యానికి  అల్లుళ్ళ పండుగ అని కుడా అంటారు.ధనలక్ష్మి , దాన్యలక్ష్మి , పోషించే పౌష్యలక్ష్మి చల్లగా చూడమ్మా .. సస్యలక్ష్మి  అంటూ రైతులు పకృతిని , పంటచేలను ఆరాదింకుంటారు. ఈ పండుగను వివిధ రాష్ట్రాలలో వారి వారి ఆచారాలతో, పద్దతులతో, ఆచరించడం పరిపాటి. సంక్రాంతి అనగానే బోగిపళ్ళు , బొమ్మలకొలువులు , పేరంటాలు , ముగ్గులు , గొబ్బిళ్ళు , బంతిపూల తోరణాలు , పాకలు, పందిళ్ళకి వేలాడే ధాన్యపు కంకులు , బళ్ళ నిండా చెరుకు గడలు , రేగిపళ్ళు గాదెల్లో కొత్త  ధాన్యాలు , సరదాగా అల్లుల్లతో  కూతుళ్ళతో పిన్న పెద్దలు హడావిళ్ళు , '' డూ డూ '' బసవన్నలూ, హరిలోరంగా అంటూ హరిదాసులు. శంఖం పూరించే జంగం దేవుళ్ళు, అంబ పలుకు జగదంభ పలుకు అంటూ బుడబ్బుక్కలోళ్ళు, వారి డమకరు నాదాలు , బోగి మంటలు  ఇలా పండుగ తెచ్చే హారెంతో!  గుర్తుకురాని వారుండరు . పల్లెటూర్లలో ఎడ్ల పందాలు , పొట్టేళ్ల పందాలు , కోడి పందాలు వినోదం కుడా తోడవతుంది. ఈ సంక్రాంతి పండుగ వేడుకలతో నిండి, కన్నులు కళకళలాడించే  లక్ష్మిశోభను తెలుగునాట ఏఇంట చుసిన సస్య లక్ష్మితో, గృహ లక్ష్మితో , దాన్యలక్ష్మితో కలసి ధనలక్ష్మి తాండవ మాడించే తెలుగు పండగ.

సంక్రాంతి ముగ్గులు ; సంక్రాంతి నెలపట్టిన దగ్గర నుండి ఆడవాళ్ళ సంక్రాంతి ముగ్గులు! సంక్రాంతి రథం, తాబేలు పద్మం అనీ ఇలా రకరకాల సంక్రాంతి ముగ్గులు, రంగురంగుల 'రంగవల్లిక' లతో పెట్టి కళానైపుణ్యమంతా తెలుగుగడ్డ మీద ఓలకబోస్తారు . ఈ ముగ్గుల పై గొబ్బిళ్ళు  పెట్టి తులసికోట వద్ద  ప్రమిదలతో ముగ్గుల మీద దీపాలు వెలిగించి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తారు .

గొబ్బెమ్మలు ;
గొబ్బిళ్ళతో భూదేవికి పూజ , భూగోళానికి ప్రతీకగా, ఆడపిల్లలు ఆవుపెడ తెచ్చి, దానితో గొబ్బిళ్ళు చేసి , వాటికి పసుపు కుంకుమ  అలంకరించి , పూలతో సస్యలక్ష్మిలా ఉన్న ఋతువును సూచించేందుకుగుమ్మడిపూలు గాని, బీరపూలు గాని, గొబ్బెమ్మలపై ఉంచి గొబ్బెమ్మల పాత పాడుతూ గొబ్బెమ్మలచుట్టూ తిరుగుతారు.  ఆనందం అంతా ఇంతా కాదు.   

బోగి మంటలు ;
బోగి పండుగ రోజు తెల్లవారుజామున ప్రతి ఇంటిముందు బోగిమంటలు వేస్తారు. ఈమంటలలో పాత అంతటిని తుడిచి పోగేసి తగలేసి  ''ధుని'' లేక యజ్ఞకుండమే  ఈ బోగిమంటలు. అంటే! పాతను విసర్జించి కొత్తకు స్వాగతం పలుకుతాయి. ఈ మంటలలో వేసిన గోమయంతో చేసిన గొబ్బి పిడకలు పొగ ఉపిరితిత్తుల వ్యాధిని నిరోధిస్తాయంటారు వైద్యులు. ఈ రోజు గొబ్బి పిడకలు మంట వద్ద శరీరమును కాచుకొని, నల్ల నువ్వుల ముద్దతో నలుగు పెట్టుకొని తలంటిస్నానం చేసి, కొత్తబట్టలు ధరించాలి. దగ్గరలో ఉన్న దేవాలయమునకు వెళ్లి స్వామి వారిని దర్శించుకొని, నల్ల నువ్వుల దానమివ్వాలి.

బోగిపళ్ళు;
బోగిరోజున బోగిమంటల్లాగే సాయంత్రం చంటి పిల్లలు ఉన్నవాళ్ళు పళ్ళెంలో  రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, పూలరేకులు కలపి పిల్లలకు దిష్టితీసి బోగిపళ్ళు పోస్తారు. ఈ బోగిపళ్ళు పోయించుకున్న చిన్నారులు  కలకాలం బోగబగ్యాలతో తులతూగుతారని మన పూర్వికుల నమ్మకమైన ఆచారం.  పసిపిల్లలకు తలపై రాగి దమ్మిడీలు (రాగి పైసలు) పెట్టి నుదుట, బొట్టు పెట్టి దీవించి ఈ బోగిపళ్ళు పోస్తారు.

మకర సంక్రాంతి; 
సూర్య సంచారాన్ని బట్టి, సూర్యుని ఉద్దేశించి చేసే పండుగ సంక్రాంతి పండుగ. ఈ రోజు నుండే ఉత్తరాయణం ప్రారంభమవతుంది. పకృతిలో స్వష్ట మైన మార్పు వస్తునది. పౌస్య లక్ష్మి  ప్రకాశించగా పకృతి మాత కొత్త కాంతులతో  శోబిల్లుతూ, సూర్య భగవానుడు  దివ్య కాంతులు వేదజల్లుతుంటే,  కొత్తదాన్యం ఇండ్లకు రాగ, ప్రజలు సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకుంటారు. దీనిని పెద్దపండగ అని, పెద్దల పండుగ అని అంటారు.  ఈ పండుగతో పాటు గతించిన పితృదేవతలకు తర్పణాలు వదిలి, పెద్దల ఋణాలనూ తీర్చుకునట్లు తృప్తి చెందుతారు.  ఈ పండుగ సుర్యభగవానుని  ప్రభావం చేత ఏర్పడే పండుగ కనుక సూర్యారాధనా ప్రదానం.       
సూర్యునికేదురురుగా  గృహ ప్రాంగణాన్ని ఆవు పేడతో అలికి , బియ్యపు పిండి , పసుపు కుంకుమలను కలపి అరవై  నాలుగు అంగుళాలు పరిణామం గల చక్రాన్ని వేసి మద్యలో ప్రద్మాన్ని వేసిదీనిని సూర్యచక్రంగాను , సూర్య నారయణుని గాను భావించి, పుష్పాలతో పూజించి, సుగంధ ద్రవ్య  గంధాక్షితులను చల్లి ధూప దీపాలను వెలిగించి, పొంగలిని నైవేద్యం పెట్టి కర్పూరహరతులనిచ్చి  సేవించాలి .
బ్రహ్మకల్పం ప్రారంభంలో ప్రళయం వచ్చి ఈ ప్రపంచ మంత జలమయమైనపుడు ఈ భూమి సముద్రంలో మునిగిపోయి కొన్ని సంవత్సరాలు అలాగే నీళ్ళ లో ప్రళయ స్థితిలో  ఉన్నపుడు శ్రీ మహావిష్ణువు  ఆది వరహారూపంలో ఈ భూమిని పైకి తెచ్చినది ఈ మకర సంక్రాంతి రోజునే. వామనావతార ఘట్టంలో వామనుడికి బలి మూడు అడుగుల నేలను దానం చేసింది ఈ పర్వదినం నాదే. బ్రంహాండమంతా తన రెండడుగులతో కొలచి , తన మూడవ పాదాన్ని బలి శిరస్సును మోపి అతడిని పాతాళానికి పంపినది కుడా ఈ మకర సంక్రమణపుణ్యకాలంలోనే.


కనుమ పండుగ;  మూడవ రోజున కనుమ ఇది పశువుల మూగ జీవాల పండుగ అవును మనం గోమాతను పుజిస్తాము. మానవ జీవన విధాన సరళిలో  పశువుల పాత్ర ప్రధానం . వ్యవసాయదులలో సాయపడి దేశమందలి   పాడిపంటలు అభివృధికి దోహదపడతాయి  పశువులు. పరోపకారమే ద్యేయంగా గల ఈ మూగ జీవాలను గౌరవించడమే ఈ పశువుల పండుగ ఏర్పాటు చేయబడినది. వ్యవసాయదారులు ఉదయమే పశువులును వేడి నీళ్ళతో శుబ్రంగా కడిగి పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి మేడలో  గంటలు కట్టి  కొమ్ములకు  పూలమాలలు కట్టి వాటిని పూజించి గోప్రధక్షణలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో విస్తట్లో భోజనం వడ్డించి వాటికి తినిపించి గుడికి తెసుకేళ్ళడం ఒక ఆచారం. ఈ విధంగా పశువుల పండగ నిర్వహించి   పశువుల రుణాన్ని తీర్చుకున్నట్టు  భావిస్తారు. కనుమనాడు మినుమలు తినాలని , లేకపోతే యముడు ఇనుమును కోరికిస్తాడని పూర్వికుల నమ్మకం.
అందుకే  ప్రతిఇంట ఈనాడు గారెల పిండి వంటలు తప్పక చేస్తారు.  కొత్త మంది స్త్రీలు తమ ఆచారాలుగా ఊరు పొలిమేరలో ఉన్న గంగమ్మ , పోలేరమ్మ మొదలగు గ్రామదేవతలకు నైవేద్యం సమర్పిస్తారు.  పురుషులు ఊరు పోలిమేర్ల్లలో మామిడి తోపుల్లో చేరి , కోడి పంద్యాలు , పొట్టేళ్ల పందాలు సరదాగా తిలకిస్తారు. కనుమ రోజున ప్రయాణం ఎవరు పెట్టుకోరు. కనుమ రోజున కాకి కుడా ఎక్కడ బయలు దేరదని పూర్వ సామెత . పెళ్ళీడు కొచ్చిన కన్నె పిల్లలు ఈ రోజున బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఈ పండుగకు పెట్టె గొబ్బిళ్ళున్నీ  ప్రతి రోజు  పిడకలుచేసి ఎండబెట్టాలి. తరువాత దండగుచ్చి అట్టే పెట్టి  మాఘ శుద్ధ సప్తమి  అదే రథసప్తమి నాడు ఈ పిడకలను వినియోగించాలి.

05 January 2012

ఈ సంవత్సరం - ఓ ప్రతిజ్ఞ చేద్దాం....

ప్రతి కొత్త సంవత్సరంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమంగా భావించే వారు చాల మంది ఉంటారు. కొత్త సంవత్సరం వస్తూనే మనం పెద్ద పండుగ సంక్రాంతి  శోభను వెంట తెస్తుంది. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగ శుభాకాంక్షలుతో  ఈ క్రింద ప్రతిజ్ఞను ప్రచారం చేస్తూ నిర్ణయం తీసుకుందాం. దానికి కట్టుబడి ఉండటానికి మన శక్తి కొలది ప్రయత్నం  చేద్దాం.. చేయిద్దాం....  ప్రతిజ్ఞ --

నా తల్లి భాష తెలుగు భాష ని  గౌరవిస్తావని ,నన్ను పరిచయం చేసుకునే ప్రతి సందర్భంలో నా పేరు మరియు ఇతర వివరాలతో నా మాతృభాష కూడా వెల్లడిస్తానని,నా తోటి తెలుగు వారితోను మరియు  ప్రజా వేదికలపై  తెలుగులో మాట్లాడుతానని , అన్నిసందర్భాలలో  తెలుగులో సంతకం చేస్తానని , నా మాతృభాష గౌరవిస్తూ  భాష అభివృధికి  అన్ని విధాల కృషి చేస్తానని  ఈసంవత్సరం  -  ఓ ప్రతిజ్ఞ చేద్దాం....

21 September 2011

ఆధునిక సాహిత్యానికి.. అడుగు జాడ... మన గురజాడ 150వ జన్మదినోత్సవం

గురజాడ అప్పారావు
ఆధునికాంధ్ర సాహిత్యానికి దిశా నిర్దేశం చేస్తూ దీపధారియై ముందు నడుస్తూ  అడుగు జాడ గురజాడది అనిపించుకున్న గురజాడ సాహితీపరులందరికీ చిరస్మరణీయుడు.
 

దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్...

వట్టిమాటలు కట్టి పెట్టోయ్...  గట్టిమేల్ తలపెట్టవోయ్....
అంటూ దేశ ప్రజను జాతీయ దృక్పదంతో ఉద్బోధిస్తూ  రాసినగేయం ఏదేశప్రజలైనా పాడుకోదగ్గది. 
ఇలాంటి దేశభక్తి గేయం మరో బాషలో ఉండదనుకున్న అతిశయోక్తి కాదనిపిస్తుంది.

ఆయన సమాజంలోఉన్న మూఢవిశ్వాసాల్ని డంబాచారాల్ని తోకచుక్క అనే గేయంలో  కడిగివేశారు.  ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది అన్నారు. 
 
 

గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది.  విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం గ్రామంలో 1862 సెప్టెంబర్  21 అప్పారావు జన్మించాడు.  తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లిలో పదేళ్ళ వరకు చదివాడు..
 
అతడు తన హైస్కూలు చదువుల రోజులలోనే శ్లోకాలు వ్రాసేవాడట. కాలేజీ లో అడుగు పెట్టిన కొత్తల్లోనే (21వ ఏట) సారంగధర అన్న ఇంగ్లీషు పద్యకావ్యాన్ని ప్రచురించిన ధీశాలి.  అప్పట్లోనే చంద్రహాస అన్న మరో ఇంగ్లీషు కావ్యాన్నికూడా వ్రాసేడు.  సారంగధర కావ్యం ఎంత పేరుపొందిందంటే ఆ ప్రచురిత కావ్యాన్ని  ప్రముఖ కలకత్తా పత్రిక తిరిగి తమ పత్రికలో ప్రచురించేటంత. అయితే వీటినీ, ఆతరువాత కొన్ని సంస్కృత నాటకాలకి ఆంగ్లంలో వ్రాసిన పీఠికలనుగానీ ఆ కవిశేఖరుని ఆంగ్ల భాషా వైదుష్యానికి  మచ్చుతునకలనవచ్చునేమో గానీ ఆయనకి చిరకీర్తిని తెచ్చి పెట్టినది మాత్రం తెలుగు లో మాగ్నమ్ ఆపస్ ( Magnum opus ) అనదగ్గ  కన్యాశుల్క నాటక రచన మాత్రమే..

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని సుమారు 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు .  ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు..

1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1892 లో ప్రచురించిన మొదటి కూర్పుకు --- సమాజ, సాహితీపరుల ఆమోదపు ప్రోత్సాహంతోనూ కన్యా శుల్కం నాటకాన్నితిరగ రాసి  ఎన్నో మార్పులు చేసి 1909 లో రెండవ కూర్పును ప్రచురించాడు. వాడుక భాషలో, విజయనగర ప్రాంత యాసలో రాసిన ఈ నాటకం 100 సంవత్సరాల తరువాత కూడా ఈ నాటికీ పాఠకులను అలరిస్తూ ఉంది. ఈ నాటకం కన్నడం, ఫ్రెంచి, రష్యన్‌, ఇంగ్లీషు (2 సార్లు), తమిళం, హిందీ (2 సార్లు) భాషల్లోకి అనువాదమైంది 
 
ఇతర రచనలు
సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం-ఇండియన్ లీజర్ అవర్ (విజయనగరం) లోనూ రీస్ అండ్ రయ్యత్ (బెంగాల్) పత్రిక లోనూ ప్రచురించబడింది)పూర్ణమ్మ,  కొండుభట్టీయం,     నీలగిరి పాటలు ,ముత్యాల సరాలు,     కన్యక,     సత్యవ్రతి శతకము,     బిల్హణీయం (అసంపూర్ణం),     సుభద్ర,     లంగరెత్తుము,     దించులంగరు,     లవణరాజు కల,     కాసులు, సౌదామిని,   కథానికలు,       దిద్దుబాటు,     మెటిల్డా,   సంస్కర్త హృదయం,  మతము-విమతము.
ఆయన రచనలు రాశిలో తక్కువైనా, వాసికెక్కిన రచనలాయనవి. 

1884 లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.  1886 లో డిప్యూటీ కలెక్టరు ఆఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.

 గురజాడ శాసన పరిష్కర్త, సాహితీవేత్త, భాషా శాస్త్రవేత్త కూడా. గిడుగు రామ్మూర్తిగారితో (విజయనగరంలో చదువుతున్నపుడు నుండి మంచి స్నేహితులు) కలిసి పలు ప్రాంతాలలో చర్చలలో పాల్గొనడం, గ్రాంథిక భాష వాడుక లోపాల్ని చెప్పడంతో బాటు, వ్యవహారిక భాషలో రచనలు చేయడం వల్ల లాభాల్ని వివరిస్తూ, అంతటితో వూరుకోకుండా విశ్వవిద్యాలయాల్లో బోధనా భాషగా వ్యవహారిక భాష ఉండాలని ఉద్యమరీతిలో కృషి చేశారు. 
 
ఆరోగ్యం బాగోకపోయినా (53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గరజాడ అప్పారావు మరణించాడు) 52సంవత్సరాల లోపలే ఇన్ని కార్యక్రమాల్ని నిర్వహించారు. సంకల్పబలం ఉంటే తీరిక లేకపోయినా, ఆరోగ్యం బాగుండకపోయినా గొప్ప గొప్ప పనుల్ని ఒంటరిగా, అవలీలగా నిర్వహించవచ్చని నిరూపించారు గురజాడ వేంకట అప్పారావు.

18 September 2011

తెలుగు బ్లాగర్లకి గౌరవ సూచన విజ్ఞప్తి..!

కవులు - రచయితలు,  పెద్దలు - ఆదర్శులు,
యువకులు  - యువతీయులు,   మహిళలు  - మేధావులు 
అందరికి భాషాబివందనాలు..! 

వ్యక్తులు, వ్యక్తిత్వాలు, వ్యవస్థలు, చరిత్రలు,  సాహిత్య , సాంకేతిక,  సమాజ హితమైన సలహాలు సూచనలతో వివిధ / విశేష  సందర్భాలలో ఎప్పటికప్పుడు స్పందిస్తూ  అవగాహన, చైతన్య పరుస్తున్నారు.....  
మన తల్లి భాష యైన  " తెలుగు "
తెలుగు భాష - యాస,  సంస్కృతి - సాంప్రదాయ,  జనపద - జానపద  జాతి - సాహిత్య విషయాలను  చర్చిస్తూ - పోస్ట్ చేస్తూ ....

తెలుగు  భాష - జాతి   అభివృద్ధికి  కృషి  చేయాలని  
తెలుగు  రక్షణ  వేదిక 
తెలుగు బ్లాగర్లకి గౌరవ సూచనా విజ్ఞప్తి చేస్తుంది.....!

ధన్యవాదాలు .మీ. 
పొట్లూరి హరికృష్ణ - 99 080 57 895.

17 September 2011

సర్దార్ పటేల్ V/s నిజాం = హైదరాబాదు రాజ్య విమోచనం..!

భారత దేశానికి   1947ఆగస్టు  15న స్వాతంత్ర్యం  వచ్చినది.   స్వాతంత్ర్యం తర్వాత  స్వల్ప వ్యవధిలోనే  ఎలాంటి  హింస  రక్తపాతం లేకుండా  534 రాచరిక  సంస్థానాలు  దేశంలో ఐఖ్యమై భారత ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడినది.  కానీ నిజాం పాలనలోని  హైదరాబాదు  రాజ్య  ప్రాంతం (  హై.బా రాజ్య విస్తీర్ణం-- 82.7 వేల చదరపు మైళ్ళు) భారత  ప్రభుత్వం లో కలవలేదు.  

కలవక పోగా మరో వైపు   7వ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ ఆదేశాలతో  ఖాసిం రజ్వీ  సైన్యాలు  తెలంగాణా ప్రాంతంలో రాయడానికి వీలుకాని  అంత అరాచకం సృష్టించారు.  ఆ సందర్భంలో కమ్యునిస్టు పార్టీ నాయకత్వంలో దళాలు , సంఘాలు మరియు సమరయోధులు నిజాం రజాకార్ల  సైన్యాన్ని ఎదురిస్తూ ప్రజల పక్షాన పోరాడుతున్నారు.

ఈ  క్రమంలో  భారత  ప్రభుత్వం   సర్దార్ వల్లభాయ్
పటేల్ ఆదేశాలతో  సైన్యం " ఆపరేషన్ పోలో " పేరుతో  1948 సెప్టెంబరు   13న   నిజాం హైదరాబాదు  రాజ్యంలో  కదం తొక్కాయి. రాజ్యన్ని నలువైపుల  నుంచి సైన్యం చుట్టూ ముట్టారు.  సైన్యాలతో పోరాడలేక  1948 సెప్టెంబరు 17న  నిజాం ప్రభువు  మీర్ ఉస్మాన్ ఆలీఖాన్  భారత ప్రభుత్వానికి లొంగిపోయారు.   బొల్లారంలోని  ప్రస్తుత  రాష్ట్రపతిభవన్ లో  నిజాం  సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎదుట  లొంగిపోయాడు.




చిత్రం లో

సర్దార్ పటేల్
జీకి

నమస్కరిస్తున్న

నిజాం నవాబు

మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ .





భారత  గవర్నర్ జనరల్  హిస్  ఎక్స్ లెన్సీ   రాజ గోపాలాచారి ఆదేశాల మేరకు నా ప్రభుత్వం  రాజీనామా చేసింది అని  రేడియోలో ప్రకటించాడు. ఈ విలీన కార్యక్రమం  సర్దార్ వల్లభాయ్ పటేల్  సమక్షంలో జరిగింది.   ఈ విలీనం తో  సంపూర్ణ భారతదేశం ఏర్పడినది. 
కర్ణాటకలోని కొన్ని జిల్లాల లో   ( హైదరాబాద్  కర్ణాటక ప్రాంతం )   సెప్టెంబరు 17ను  విమోచన దినాచరణ 1948 నుంచి  జరుగుచున్నది. 

16 September 2011

మనసుతో పనిలేని ఓ యంత్రమా ఈ తెలుగు వాడు ..?

ఏ జాతి  సమస్త వ్యవహారాలూ ఆ జాతి మాతృభాషలో జరుగుతాయో ఆ జాతి సుఖపడుతుంది.ఎప్పటికి అది విజేతగానే ఉంటుంది. ఆంగ్లేయులను వాళ్ళ దేశాలను పరిశీలిస్తే దురాక్రమణత్వం వల్ల భౌతిక సంపదలు సమకురాటమేకాక వారి భాష కూడా వాళ్ళ ఆక్రమించిన దేశాల్లో రాజ్యం ఏలింది . ఏలుతున్నది. తమ జీవితంలో అన్ని రంగాల్లో తమ మాతృభాషా వాడుకంలో ఉండేలా  వాళ్ళు కృషి చేస్తారు , ఇంట్లో , ఆఫీసులో , కోర్టులో చివరికి చర్చిలో కుడా వాళ్ళు మాతృభాషలోనే  వ్యవహారాలూ నడుస్తాయి . కాబట్టే వారి భాష వారు సుఖపడుతున్నారు. 

తెలుగు ప్రజలు ఇంట్లో తెలుగు మాట్లాడుకున్న , ఆఫీసులో ఇంగ్లీష్ , కోర్టులో  ఇంగ్లీష్ , కొన్ని ప్రాంతాల్లో హింది లేదా ఉర్దూ మాట్లాడల్సివస్తుంది . చివరికి దేవుడి ప్రార్థన చేసుకుందామన్న సంస్క్రుతంలోనో , అరబ్బీ లోనో  చేసుకోవలసివస్తుంది . తెలుగు మనిషి  మనసుతో పనిలేని ఓ యంత్రం లాగా మారాడు .   తెలుగు  క్రైస్తవులు తమ ఆద్యాత్మిక వ్యవహారాలన్ని తెలుగులోకి మార్చుకోవడం వల్ల కనీసం మానసిక ఆనందాన్ని పొందగలుగుతున్నాడు.  తెలుగు  హిందువులు ,  తెలుగు ముస్లీంలు  మొదట తమ ఆద్యాత్మిక వ్యవహారాలను తెలుగులోకి మార్చుకోగలిగితే  తెలుగు హృదయం స్వేచ్చగా  పలుకుతుంది. దేవునితో మాట్లాడే భాష హొదా తెలుగుకు వస్తుంది.  ఆ ఆనందం వర్ణించలేనిదీ.

పూర్వ కాలంలో  మన  దేశంలోని   రాజులు  చక్రవర్తులు  తమ  తమ  మాతృ  భాషలలో  ప్రజలతో సంభాషించేవారు. ఆలాగే   ధైనందిన జీవిత వ్యవహారాల  పరిష్కారాల  విషయంలో కుడా మాతృభాషనీ ఉపయోగించడం వలన ప్రజలకు రాజ్యపాలన దగ్గరైంది .  ప్రజల భాషలోనే  కుడా రాజ్యపాలన సాగింది . ఎవరైనా  భాధితుడు  వచ్చి ధర్మ గంటను మ్రోగిస్తే ,  రాజు విచ్చేసి భాధితుడి   మొర  విని నిందితుడ్ని పిలిపించి  అందరి సమక్షంలో విచారించేవాడు.  అ విచారణలో  ఇరు పక్షాలు వాదోపవాదాలు  మాతృ భాషలో జరిగేవి.  తీర్పురి  అయన రాజుగారికి  ఫిర్యాది  - నిందితుడికి   మద్య మధ్యవర్తిగా  ఎ ''ప్లీడరు'' వుండేవాడు కాదు. 

రాజు విచారణ జరిగేటప్పుడు  ప్రజల  భాషలోనే   ప్రశ్నించి  వివాద  మర్మాన్ని  పసిగట్టేవాడు.  చివరకు ప్రజల భాషలోనే  తీర్పు   ప్రకటించే వాడు.  ఈ మేరకు అటు విచారణ  ఇటు తీర్పు   ప్రజల సొంత భాషల్లొ జరగటంతో మధ్యవర్తుల ఆవసరమే వుండేది  కాదు.  తీర్పు సొంత భాషలో రావడంతో పిర్యాదునికిగాని, నిందుతుడుకిగాని  అర్థం కానిదంటు ఎమి వుండేది  కాదు. ప్రస్తుత న్యాయపరిపాలన  విధానంతో ఆనాటి పద్దతులను  పోల్చి చూసుకుంటే ఎంతో క్షోభ కల్గుతుంది .

14 September 2011

తెలుగు సతతము వెలుగు(ని)రా ..!

తెలుగురా.. ఇది తెలుగురా...
తెలుగు సతతము వెలుగు (ని) రా ...!

చండ్రనిప్పుల  తాండ్ర  పాపయ 
గండ్ర గొడ్డలి పదునురా            
!! తెలుగురా !!

భద్రకాళిని  బోలు రుద్రమ్మ 
శౌర్య చంద్రిమ రూపురా            
!! తెలుగురా !!

పోరుసలిపిన  వీరుడు అల్లూరి 
నిశినిశిత శరమ్మురా               
!! తెలుగురా !!

మంట గురిసిన  మహాకవి  శ్రీశ్రీ
కవితారా                              
!! తెలుగురా !!

గుండు కెదురుగా గుండె నిలిపిన ప్రకాశం 
ధైర్యమ్మురా                            
!! తెలుగురా !!

బద్దకస్తుల నిద్దురను పోగొట్టు గద్దరు 
గళమురా..                         
!! తెలుగురా !!

12 September 2011

తెలుగు ''సుప్రీం'' న్యాయమూర్తిగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్..!

సుప్రీం కోర్టులో  ఐదుగురు  న్యాయమూర్తుల నియామక పక్రియ జరిగింది, 
ఆ ఐదుగురులో  మన తెలుగువాడు జస్టిస్   '' జాస్తి చలమేశ్వర్ '' కూడా ఉన్నారు.

ఆయన 1953జూన్ 23న కృష్ణ జిల్లా లోని మొవ్వ మండలం పెదముత్తేవి లో లక్ష్మి నారాయణ, అన్నపూర్ణాదేవి దంపతులకు  జన్మించారు. బార్య లక్ష్మినళిని , ముగ్గురు కుమారులు వెంకట రామ్ భూపాల్, నాగ భూషణ్, లక్ష్మి నారాయణ ఉన్నారు.

 జాస్తి లక్ష్మినారాయణ మచిలీపట్నంలో న్యాయవాదిగా  పనిచేస్తున్న కాలంలో హిందు హైస్కూల్  జస్టిస్  ''జాస్తి చలమేశ్వర్'' పీ.యూ.సీ వరకు చదివారు. మద్రాసు లయోలా కాలేజీలో బీఎస్పీ (పిజిక్స్) చదివారు. 1976లొ విశాకలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఎల్.ల్.బీ పూర్తిచేశారు. అదే ఏడాది బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు.

జస్టిస్ గారికి  రాజ్యాంగ, ఎన్నికల, సెంట్రోల్  ఎక్సైజ్ , కస్టమ్స్ , ఐటీ, క్రిమినల్ చట్టాల్లో మంచి ప్రావీణ్యమ్ ఉంది. 1985-1986లో రాష్ట్ర లోకాయుక్త స్టాండింగ్ కౌన్సిల్ గా వ్యవహరించారు.  1988-1989లో  ప్రభుత్వ న్యాయవాది (హూంశాఖ వ్యవహారాలు) గా నియమితులయ్యారు. 1995లో సీనియర్ న్యాయవాదులయ్యారు.  1997జూన్ 23న పుట్టిన రోజునే రాష్ట్ర  హైకోర్ట్ అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు  స్వీకరించారు.  1999మే 17న పూర్తి  స్థాయి  న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టారు. 2007మే  3   న గౌహతి హైకోర్ట్ చీఫ్  జస్టిస్  గా పదోన్నతిపై  వెళ్లారు.  2010మార్చి  17నుంచి  కేరళ  హైకోర్ట్  ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు  చేపట్టారు. . పాడిపంటలన్న  ప్రతేక అభిమానం. జస్టిస్   గారు ఏటా రెండు మూడు సార్లు పెదముత్తేవి వచ్చి తన పొలాలను స్వయంగా పర్యవేక్షించేవారు.   
 
తెలుగువారు సుప్రీం కోర్టులో న్యాయముర్తులుగా పనిచేసినవారు జస్టిస్ పి.సత్యనారాయణ, జస్టిస్ పి.జగన్ మోహన్ రెడ్డి , జస్టిస్  ఓ.చిన్నపరెడ్డి , జస్టిస్  కే.రామస్వామి, జస్టిస్ కే. జయచంద్రా రెడ్డి, జస్టిస్ బి.పి.జీవనరెడ్డి, జస్టిస్  ఎం.జగన్నాథరావు,  జస్టిస్ పి.వెంకట రామారెడ్డి,  జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి సేవలు అందించడం. మనం గర్వించదగ్గ విషయమే. 

11 September 2011

జాతీయ స్థాయిలో తెలుగు వెలుగులు.!

ఏదేశంలోనైన  రాజకీయాలు అనేక అంశాల ద్వారా ప్రభావితం అవుతాయి. ఎ ప్రాంతం వారి పాత్ర ఎంతని చెప్పడం కష్టం. చరిత్ర  కొన్ని బౌతిక కారణాల ద్వార ప్రభావితం అవుతుంటుంది. రాజకీయాలు చరిత్రలో భాగం. రాజకీయాలను కేవలం రాజకీయ నాయకులే ప్రభావితం చయనక్కర్లేదు. సాహిత్యం , సంస్కృతి , కళలు, ఉద్యమాలు మొదలైనవన్నీ రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. తెలుగువారు విభిన్న రంగాలలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచారు. రాజకీయాలను కూడా ప్రభావితం చేసారు. 

తెలుగువారికి  విశిష్టమైన  అంశం  ఏమిటంటే  అంతర్జాతీయ స్థాయిలో  జరిగిన  పరిణామాలకు  దేశంలో మిగతా  వారందరి కంటే ముందు ప్రభావితమై స్పందించిన సందర్భాలు చాలా  ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో అభ్యుదయం మిగతా భాష సాహిత్యలకంటే ముందుగా జరిగింది. ఒక అభ్యుదయ విప్లవోద్యమాలే కాదు,  స్త్రీవాదం ముందుగా తెలుగు  సాహిత్యంలో చోటుచేసుకున్నట్లు కనపడుతుంది. దేశంలో వివిధ  ప్రాంతాలలో జరిగిన  ఉద్యమాలకు తెలుగువారు స్పందించి మరింత ముందుకు తెసుకేల్లిన సందర్భాలున్నాయి. బెంగాల్ లో ప్రారంభమైన సంఘ సంస్కరణొద్యమ ప్రభావం తెలుగు సాహిత్యంలో  కనపడుతుంది.  హిమాలయాలను వర్ణించిన అల్లసాని పెద్దన నుంచి - తాజ్ మహాల్  పడగోట్టండోయ్. రాయి రాయి  విడగోట్టండోయ్! అన్న ఆలూరి బైరాగి వరకూ తెలుగువారే. కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్యం వివిధ భాష  సంస్కృతులను ప్రభావితం చేసాయి.

దేశమంటే "మనుషు"లని జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు గురజాడ అప్పారావు. తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు " నేను సైతం ప్రపంచాగ్నికి   సమిధ నోక్కటి....." అన్న శ్రీ శ్రీ. జ్ఞానపీట అవార్డు పొందిన విశ్వనాధ్ , సి.నా.రే తో పాటుమరెందరో తెలుగు రచయితలు జాతీయ సాహిత్యంలో స్థానం పాదించుకున్నారు. 
తెలుగు పాత్రికీయులు దేశరాజకీయాలను ప్రభావితం చేసేంత కీలక పాత్ర పోషించారు. సి.వై. చింతామణి, చలపతిరావు, కుందూరి ఈశ్వర్ దత్,  జి.కే. రెడ్డి ,  నార్ల వెంకటేశ్వరావులు జాతీయ స్థాయిలో  చేసిన  కృషి మరువలేం. 

స్వాతంత్రోద్యమంలో తెలుగువారి పాత్రను మనం గుర్తు చేసుకుంటే దేశ రాజకీయాలను  ప్రభావితం చేయగలిగింది అర్థం అవుతుంది.  అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడుగా  భోగరాజు పట్టాభి సీతారమయ్య స్వతంత్ర సమరంలో  నిర్వహించిన పాత్ర  చరిత్ర  పుటల్లో రికార్డుయి ఉంది. ఆయన రచించిన భారత జాతీయ  కాంగ్రెస్  చరిత్ర  ఇప్పటికీ  కాంగ్రెస్   చరిత్రకు సంబంధించి  ప్రామాణిక  గ్రంధం.   ఎ.ఐ.సి.సి అద్యక్షుడైన కొండా వెంకటప్పయ్య కుడా ఆనాడే   తెలుగు వారి కోసం ప్రత్యెక రాష్ట్రం డిమాండు చేసేందుకు  మాంటేగ్-చేమ్స్ పర్డు  బృందాన్ని  కలిసారు.  

ఆంద్ర రాష్ట్ర  ప్రధమ ముఖ్యమంత్రి గా టంగుటూరి ప్రకాశం స్వాతంత్ర సమరంలో పాల్గొన్న తీరు , స్వరాజ్య పత్రిక సంపాదకుడుగా గాంధీజీ ప్రశంసలు అందుకున్న వైనం చరిత్రలో నిలిచిపోయింది.  జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య.  ఆంధ్ర పత్రిక  వ్యవస్థాపకులు కాశినాధుని నాగేశ్వరరావు , నైటింగేల్ అఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన సరోజినీ నాయుడు, ప్రముఖ తత్వశాస్త్రవేత్త మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మరో  మాజీ రాష్ట్రపతి వి.వి. గిరి,  పార్లమెంటులోనూ, ప్రజా ఉద్యమాలల్లోను  సమర్థమంతమైన పాత్ర పోషించిన  తెన్నేటి  విశ్వనాథం, జాతీయోద్యమంలో అగ్రశ్రేణి నాయకుడిగా గుర్తింపు పొందిన బాలగంగాధర్ తిలక్  పిలుపు ఇచ్చిన  హాంరూల్   ఉద్యమంలో పాల్గొన్న స్వామి రామాంద తీర్థ, రాజకీయ వేత్త, సాహిత్యవేత్త ,మాజీ కేంద్ర మంత్రి బెజవాడ గోపాలరెడ్డి , తెలంగాణా సాయుధ పోరాటంలో పాల్గొని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన      కవి ముఖ్దాం మొహియుద్దీన్, ప్రముఖ సంఘ సేవకురాలు  దుర్గాబాయ్ దేశ్ ముఖ్, కమ్యునిస్టు మార్క్రిస్టు పుచ్చలపల్లి సుందరయ్య , చండ్ర రాజేశ్వరరావు , గిరిప్రసాద్ , రావి నారాయణరెడ్డి , తరిమెల నాగిరెడ్డి , చేనేత రంగం కోసం జీవితాంతం కృషిచేసిన ప్రగడ కోటయ్య,  ప్రప్రధమ దళిత ముఖ్యమంత్రి , మాజీకేంద్ర మంత్రి  దామోదర్ సంజీవయ్య  ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాల్లొ కీలక పాత్ర  పాత్ర   పోషించిన తెలుగు ప్రముఖులెందరి గురించో ప్రస్తావించవచ్చు. వీరిలో ఒక్కొక్కరి గురించి వివరించాలంటే అదొక చరిత్ర అవుతుంది. జాతీయ రాజకీయ పక్షాల అద్యక్షులుగా  భోగరాజు పట్టాభి సీతారమయ్య  నుంచి వెంకయ్య నాయుడు భాధ్యతులు నిర్వహించడం మనం గర్వించదగ్గ విషయమే.

జాతీయ స్థాయిలో   ఏమర్జేన్సిని తీవ్రంగా వ్యేతిరేకించి రాష్ట్రంలో జనతా పార్టీ నుంచి ఏకైక  అభ్యర్థిగా గేలిచిన నీలం సంజేవరెడ్డి స్వీకర్  గా  6వ  రాష్ట్రపతి గా నిర్వహించిన పాత్ర గర్వించదగినదే. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని, రాష్ట్ర ముఖ్యమంత్రి గా, కేంద్ర హాంమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కాసు బ్రహ్మానందరెడ్డి, ప్రతేక తెలంగాణా ఉద్యమాన్ని నిర్వహించి రాష్ట్ర  జాతీయ రాజకీయాలను ఊపిన మర్రి చెన్నారెడ్డి, ఎన్.జి. రంగా, జలగం వెంగళరావు , తదితర ప్రముఖలు జాతీయ రాజకీయాలలొ ప్రముఖ పాత్ర పోషించారు.
ఇందిరా గాంధీ నుంచి రాజీవ్ గాంధీ వరకు నిదానంగా రాజకీయాలు నిర్వహిస్తూ,  అవకాశం లబించినపుడు.  తెలుగువాడి సత్తా  నిరూపించిన ఘనత పి.వి. నరసింహారావు కే  దక్కుతుది . సాహితి వేత్త, మేధావి, భాహుభాషాకోవిదుడు , అపర చాణక్యుడు పి.వి. నరసింహారావు ఆర్ధిక సంస్కరణలను దేశంలో ప్రవేశపెట్టి చరిత్ర పుటల్లో అరుదైన స్థానం సంపాదించుకున్నారు. కాంగ్రెస్ లో రాష్ట్ర నాయకులు గుర్తింపు కోల్పోవడం. అవమాన పాలుగావడం జరుగుతున్న సందర్భంలో  తెలుగువారి   ''ఆత్మాభిమానం''  నినాదంతో  తెలుగుదేశం,    నందమూరి తారక రామారావు మల్లీ డిల్లీ రాజకీయాల్లో ఆంధ్రులకు గుర్తింపు వచ్చింది. ఎన్. టి.ఆర్ .తో  కాంగ్రెస్ ప్రత్యాన్మాయ రాజకీయం  ''నేషనల్ ప్రంట్'' తెరపికి వచ్చింది. అధేవిదంగా కొత్త  తరం నాయకులకు కూడా   జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించే అవకాశం లబించింది. 

ఈ సందర్భంలో  వివిధ రంగాలలో తమ పాత్ర  పోషించిన తెలుగువారిని కూడా గుర్తుకు  తెచ్చుకోకుండా ఉండలేం . సైనికదళాల  ప్రధానాధికారిగా  పనిచేసిన  జనరల్  కే.వి. కృష్ణారావు, ఎన్నికల కమీషనర్లుగా పనిచేసిన రమాదేవి, పేరిశాస్త్రి, జి.వి.జి.    కృష్ణముర్తి ,  ప్రణాలికా సంఘం సభ్యుడు  సి.హెచే. హనుమంతురావు,  కేంద్ర కేబినేట్ సేక్రటరీ గా పనిచేసిన టి. ఆర్.ప్రసాద్, గ్యాస్ అథారిటి అఫ్ ఇండియా చైర్మన్ గా సి.ఆర్ ప్రసాద్, హొంసేక్రటరీగా పద్మనాభయ్య , ఎయిమ్స్ డైరెక్టర్ గా  పి.వేణుగోపాలరావు మొదలైన వారెందరో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు.

కళారంగంలో  యామిని కృష్ణమూర్తి , రాధ రాజారెడ్డి, వనశ్రీ రామారావు, స్వప్నసుందరి పాత్ర కూడా తక్కవేమి కాదు. తెలుగు గడ్డ పై జన్మించి హిందీ చిత్ర రంగంలో కూడా తమ ప్రతిభను నిరూపించుకున్న వహీదా రహమాన్, శ్రీదేవి, జయప్రద నటనా వైదుష్యం  అందరికీ తెలిసిందే. జయప్రద రాజకీయ రంగంలో  సైతం ఉత్తరాదిన కూడా పోటీ చేసి విజయం సాధించారు.
జాతీయ స్థాయిలో తెలుగువారు కీలకమైన పాత్రలు పోషించి తమ ముద్ర ఏమిటో నిరూపించుకున్నారు. .   ఏరంగంలో నైన తెలుగువాడి సత్తాను ఇవాళ తక్కువ అంచనా వేసే ధ్యైర్యాన్ని  జాతీయ స్థాయిలో ఎవరు పదర్శించలేరని మనం గర్వంగా చెప్పుకోవచ్చు.

09 September 2011

శ్రీ కాళోజీ 98వ జయంతి మరియు మాండలిక భాషా దినోత్సవం!

ప్రజాకవి, 
స్వాతంత్ర్య సమరయోధుడు,  
పద్మవిభూషణ్,
శ్రీ కాళోజీ  నారాయణరావు గారి  98వ జయంతి 
మరియు  
మాండలిక భాషా దినోత్సవం 

మానవుడికి పుట్టుకతోనే వచ్చే  మాండలిక భాషని  కాపాడుకోవలనేవారు, భాష రెండుతీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండు పలుకుబడుల భాష, నీభాషలోనే  బతుకున్నది - నీయాసలోనే సంస్క్రుతున్నది అనేవారు.

మన భాష, యాసలన్న అభిమానముండాలే  అనేవారు.ఆయన కవిత్వం-వ్యక్తిత్వం, రచనలు-చరణలు ప్రజల ఆకాంక్షలు-ప్రజా ఉద్యమాలకోసం కాళోజీ జీవించారు. 

 ప్రాంతాలకే   పరిమితమైన  ఈ మాండలిక  భాషా   నేటి ఈ అంతర్జాలం ద్వారా  ప్రపంచానికి చేరువ  చేసిన ఈ సాంకేతిక విప్లవానికి  మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ......
తెలుగుజాతికి  మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు .